- Advertisement -
అన్నమమ్య జిల్లాలో దారుణం ఘటన జరగింది.ప్రేమించడం లేదని యువతిపై యువకుడు యాసిడ్ దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువకుడు యువతిపై తలపై కత్తితో దాడి చేసి ఆ తర్వాత ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. గాయాలపాలైన యువతిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గణేష్ మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. కాగా ఏప్రిల్ 29 న యువతి పెళ్లి.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -