Wednesday, January 22, 2025

భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి… ఎసిపి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఎసిపి తన భార్య, మేనల్లుడిని సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమరావతిలో భరత్ గైక్వాడ్ అనే వ్యక్తి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పని చేస్తున్నారు. బానర్ ప్రాంతంలో తన భార్య మోని గైక్వాడ్, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. విధులు ముగించుకున్న అనంతరం ఎసిపి తన ఇంటికి వెళ్లిపోయాడు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అధికారి తన తుపాకీతో తొలుత తన భార్యపై కాల్పుడు జరిపాడు. కాల్పుల శబ్ధం విని కుమారుడు, మేనల్లుడు వాళ్ల రూమ్‌కు వచ్చాడు. రూమ్ డోర్ ఓపెన్ చేయగా మేనల్లుడుపై కాల్పులు జరిపాడు. అనంతరం తాను కాల్చుకుని ఎసిపి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News