Sunday, December 22, 2024

మహిళ చనిపోయిందని అల్లు అర్జున్ కు చెప్పినా పట్టించుకోలేదు: ఎసిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు వీడియో విడుదల చేశారు. బయట తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని నటుడు అల్లు అర్జున్‌కు చెప్పేందుకు ప్రయత్నించారని చిక్కడపల్లి ఎసిపి రమేష్ తెలిపారు. దయచేసి థియేటర్‌ నుంచి వెళ్లిపోండి అని అల్లు అర్జున్‌ మేనేజర్ డిసిపి వెళ్లి చెప్పినా కూడా పట్టించుకోలేదన్నారు. అల్లు అర్జున్ వద్దకు తమను వెళ్లనివ్వలేదన్నారు.  అతి కష్టం మీద వాళ్లను నెట్టుకుంటూ అల్లు అర్జున్ వద్దకు వెళ్లానని ఎసిపి తెలిపారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అల్లు అర్జున్ కు చెప్పానని, కానీ సినిమా మొత్తం చూశాకే వెళ్తానని అల్లు అర్జున్‌ చెప్పాడని ఎసిపి పేర్కొన్నారు. బౌన్సర్లకు సిపి సివి ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్‌ను ఎక్కడైనా తోసివేస్తే తాటతీస్తామన్నారు. బౌన్సర్ల తీరుకు సెలబ్రిటీలదే బాధ్యత అని సిపి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News