- Advertisement -
రాయ్‌పూర్: మావోయిస్టుల కోసం సాయుధ భద్రతా బలగాలు గాలింపులు చర్యలు జరుపుతుండగా ఐఇడి బాంబు పేలడంతో ఎసిపి దుర్మరణం చెందిన సంఘటన ఛత్తీసగఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సాయుధ భద్రతా బలగా ఎటపాల్ రహదారి మార్గంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఆసిస్టెంట్ ప్లాటూన్ కమాండర్ విజయ్ యాదవ్ (40) ఐఇడి బాంబుపై కాలు మోపాడు. దీంతో ఒక్కసారిగా పేలడంతో అతడు ఘటనా స్థలంలోనే వీరమరణం పొందాడు. విజయ్ యాదవ్‌ది స్వస్థలం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బల్దియా జిల్లాలోని రాజ్‌పూర్ గ్రామం
- Advertisement -