Thursday, January 23, 2025

హైదరాబాద్‌లో బిజెపి ఎంఎల్‌ఎ అభ్యర్థి గూబ పగలగొట్టిన ఎసిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి ఎంఎల్‌ఎ అభ్యర్థిపై ఎసిపి చేయిచేసుకోవడం సంచలనం సృష్టించింది. ఓ హోటల్ మూసివేస్తుండగా బిజెపి నేత అమర్ సింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దీంతో వెంటనే అమర్ సింగ్‌పై ఎసిపి కిషన్ చేయి చేసుకున్నాడు. దీంతో అమర్ సింగ్ మద్దతుదారులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కార్వాన్ బిజెపి అభ్యర్థిగా కిషన్ సింగ్ పోటీ చేశారు. ప్రజాప్రతినిధులు పోలీసులతో మర్యాదగా వ్యవహరించాలని లేకపోతే ఇలానే జరుగుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News