Monday, December 23, 2024

అమరుల ఆశయాల కోసం పోరాడాలి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరుల ఆశయాలకు పాటుపడాలని సైబరాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ మట్టయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం సైబరాబాద్‌లో అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎసిపి మట్టయ్య మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎందరో ప్రాణాలు త్యాగం చేయడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని తెలిపారు.

సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ పోసులు అన్నీ విభాగాల్లో ముందు ఉన్నారని అన్నారు. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. పోసులు శాంతిభద్రతలు కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. అందుకే దేశంంలో తెలంగాణ అత్యంత భద్రంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో సిఎఓ చంద్రకళ, ఆర్‌ఐ అడ్మిన్ అరుణ్‌కుమార్, ఆర్‌ఐ హిమకర్, ఆర్‌ఐ యాదయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News