- Advertisement -
చెన్నై: భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ ధాటికి భారత ప్రజలు గజగజ వణుకుతున్నారు. రెండో డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కరోనా సోకి దుర్మరణం చెందుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకిన కూడా స్వల్పంగా ఉంటుందని, ప్రాణాపాయం ఉండదని వైద్యులు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 0.4 శాతం మందికి కరోనా సోకితే చనిపోయే అవకాశం ఉన్నట్టు సమాచారం. కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు పోలీస్ అధికారులు చనిపోయారు. ఇద్దరు అధికారులు రెండు డోసులు తీసుకున్న తరువాత మృత్యువు కబలించింది. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఈశ్వరన్(52), స్పెషల్ సబ్ ఇన్ స్పెక్టర్ రవి (57) కరోనా వైరస్ తో మృతి చెందారు. సెకండ్ వేవ్ లో చెన్నైలో కరోనాతో మరణించిన పోలీసుల సంఖ్య 12కు చేరింది.
- Advertisement -