హైదరాబాద్: గోపాలపురం ఎసిపి సుధీర్‌బాబును డిజిపి సస్పెండ్ చేశారు. నిర్మాత అంజిరెడ్డి హత్య కేసులో విచారణ సరిగా చేయలేదని సస్పెన్షన్‌కు గురయ్యాడు. అంజిరెడ్డిని రియల్ ఎస్టేట్ మాఫియా హత్య చేసి ప్రమాదకరంగా చిత్రీకరించింది. ఇప్పటికే గోపాలపురం ఇన్‌స్పెక్టర్ మురళీ, డిఎస్‌ఐ దీక్షితులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
నిర్మాత అంజిరెడ్డికి రియల్ ఎస్టేట్ మాఫియాతో ఓ భూవివాదం విషయంలో గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దీంతో రియల్ ఎస్టేట్ మాఫియా అంజిరెడ్డిని హత్య చేసింది. రియల్ మాఫియా అంజిరెడ్డి హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. విచారణలో రియల్ ఎస్టేట్ మాఫియాకు అనుకూలంగా ఎసిపి సుధీర్ బాబు విచారణ చేసినట్టుగా తేలింది. కుటుంబ సభ్యులు అంజిరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసును పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ గా విచారణ చేపట్టారు. అంజి రెడ్డిది హత్య కేసు అని తేలడంతో ఎసిపి, డిఎస్ఐ, సిఐని సస్పెండ్ చేశారు.