Monday, December 23, 2024

పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఏసీపీ

- Advertisement -
- Advertisement -

మంథని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ మంథని, రామగిరి పోలీస్ స్టేషన్లను గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస్ రావు, మంథని సీఐ సతీష్‌తో కలిసి ఆదివారం పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు ఎస్‌ఐలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

అనంతరం ఏసీపీ పోలీస్ స్టేషన్‌లను తనిఖీ చేసి పోలీస్ సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్‌లో 5ఎస్ ఇంప్లిమెంటేషన్, వర్టికల్స్ విధానం అమలు చేయాలని, బ్లూకోట్ విధులు, పెట్రో కార్ విధులు, పిటిషన్ మేనేజ్‌మెంట్ అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలపై రోడ్డు భద్రత నియాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు రవి ప్రసాద్, దివ్య, మదుసూదన్ రావు, రాణి, సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News