Sunday, January 19, 2025

ఏసిపి కుమారుణ్ని కాల్వలోకి తోసేశారు!

- Advertisement -
- Advertisement -

ఢిల్లీకి చెందిన ఒక పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ కుమారుణ్ని అతని స్నేహితులే కాల్వలోకి తోసేశారు. ఈ సంఘటనలో బాధితుడికోసం పోలీసులు నదిలో గాలింపు చేపట్టారు. ఢిల్లీ ఔటర్-నార్త్ విభాగంలో యశపాల్ సింగ్ ఏసిపిగా పనిచేస్తున్నారు. ఆయన తన కుమారుడు 26 ఏళ్ల లక్ష్యచౌహాన్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో లక్ష్యచౌహాన్ పై హత్యాయత్నం జరిగినట్లు తేలింది.

లక్ష్య చౌహాన్ న్యాయవాద వృత్తిని అభ్యసించి, తీస్ హజరీ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. అతనికి అదే కోర్టులో మరో లాయర్ వద్ద క్లర్క్ గా పనిచేస్తున్న భరద్వాజ్ అనే స్నేహితుడు ఉన్నాడు. లక్ష్యచౌహాన్ భరద్వాజ్.. అభిషేక్ అనే మరో స్నేహితుడితో కలసి సోమవారంనాడు హర్యానాలోని సోనేపట్ లో ఒక వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో మూత్ర విసర్జన కోసం కారును ఓ కాల్వ దగ్గర ఆపారు. ఆ సమయంలో స్నేహితులిద్దరూ కలసి లక్ష్య చౌహాన్ ను కాల్వలోకి తోసేసి, ఏమీ ఎరుగనట్లు ఢిల్లీ చేరుకున్నారు.

పోలీసులు అభిషేక్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా జరిగిందంతా పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పాడు. భరద్వాజ వద్ద లక్ష్య చౌహాన్ అప్పు తీసుకుని చెల్లించడం లేదని, దాంతో అతన్ని నదిలోకి తోసి చంపాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు. పోలీసులు నది వెంబడి లక్ష్య చౌహాన్ కోసం వెతుకుతున్నారు. కాగా పరారీలో ఉన్న మరో నిందితుడు భరద్వాజ్ కోసం గాలింపు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News