Sunday, December 22, 2024

ఆరు గ్యారెంటీలపై చట్టం

- Advertisement -
- Advertisement -

అధికారంలోకి రాగానే అమలు

వేములవాడ, బోధన్
‘విజయభేరి’ మహాసభల్లో ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ

మన తెలంగాణ/వేములవాడ/బోధన్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను చట్టాలుగా చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభ వేములవాడలోని బాలానగర్ గ్రౌండ్‌లో శనివారం ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలి చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 24 గంటలు మోడీ తన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 24 కేసులు పెట్టారని, సిబిఐ, ఈడి, అన్ని దర్యాప్తు సంస్థలు తనపై దాడి చేస్తున్నాయని అ న్నారు. తన ఇల్లు లాక్కున్నారని, కానీ తనకు ఇల్లు భారతదేశంలోని ప్రతి పేదవాడి గుండెల్లో ఉందన్నారు. కేసులు పెట్టి లోక్‌సభ నుండి వెళ్లగొట్టారని, మోడీకి వ్యతిరేకంగా పోరాడితే కేసులేనన్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని, ఎంఐఎం పార్టీ తమపై వ్యతిరేకంగా పోరాడటానికి బిజెపి డబ్బులిస్తుందన్నారు.

తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్, రాష్ట్రం కో సం కలలుకన్న స్వప్నాన్ని కాంగ్రెస్ అధికారంలో కి రాగానే నెరవేరుస్తామన్నారు. పార్టీ అ ధికారంలోకి రాగానే ప్రతి మహిళకు నేరుగా రూ. 2500 బ్యాంకులో వేస్తామని, రూ.లు 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. అలాగే మహిళలకు బస్‌లో ఉచిత ప్రయాణం, ప్రతి రైతుకు ఎకరానికి రూ. 15 వేలు రైతు బంధు ఇస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం రాగానే మొట్టమొదటగా ఇంటి కొరకు 5లక్షల సహాయం అందిస్తామన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇల్లు నిర్మించి ఇస్తామని, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ కడతామన్నారు. ఉద్యోగాల కోసం ట్రైనింగ్ తీసుకునే వాళ్లకు 5లక్షల రూపాయలు అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, గతంలో ఓడినా గెలిచినా ప్రజల మధ్యనే ఉంటున్నానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ఆమె రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణతో మా కుటుంబానికి రక్తసంబంధం
తెలంగాణతో తమ కుటుంబానికి రాజకీయ బంధం కాదని.. రక్త సంబంధం అని బోధన్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ తెలియజేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలును కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. సిఎం కెసిఆర్ పాలన సాగిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని సైతం కాంగ్రెస్‌తోనే సాధ్యమైందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి మండవ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, సునీల్‌రెడ్డి, తాహెర్‌బిన్‌హందాన్, మోహన్‌రెడ్డి, గంగాశంకర్, తూము పద్మావతి, శరత్‌రెడ్డి, అనిల్, అరికెల నర్సారెడ్డి, అంతిరెడ్డి రాజిరెడ్డి, నగేష్‌రెడ్డి, గంగాధర్ పట్వారి తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News