Thursday, January 23, 2025

విద్యుత్ సంస్థలకు తాత్కాలిక డైరెక్టర్లు

- Advertisement -
- Advertisement -

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ( టిఎస్‌ఎస్‌పిడిసిఎల్), టిఎస్‌ఎన్‌పిడిసిఎల్‌లలో తాత్కాలిక ప్రాతిపదిక మీద డైరక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. టిఎస్‌పిడిసిఎల్‌లో కమర్షియల్ డైరక్టర్‌గా సిజిఎంగా పని చేస్తున్న కె.రాములను ప్రాజెక్టు డైరక్టర్‌గా, కె.నందకుమార్ (సిజిఎం ప్రాజెక్ట్)ను, ఆపరేషన్ డైరక్టర్‌గా నర్సింహులు (సిజిఎం ఆపరేషన్స్)ను, హెచ్‌ఆర్,ఫైనాన్స్ డైరక్టర్‌గా, కె.సుధామాధురి (రెవెన్యూ సిజిఎం)లను తాత్కాలిక డైరక్టర్లుగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖీ ఉత్తర్వులు జారీ చేయగా, టిఎస్‌ఎన్‌పిడిసిఎల్‌లో తాత్కాలిక డైరక్టర్లుగా ముగ్గురు సిజిఎంలను నియమిస్తూ సిఎండి కర్నాటి వరుణ్‌రెడ్డి ఉత్తర్వు లు జారీ చేశారు. టిఎస్‌ఎన్‌పిడిసిఎల్‌లో తాత్కాలిక ప్రాజెక్టు డైరక్టర్‌గా టి.సదరియల్ (సిజిఎం కమర్షియల్)ను, ఆపరేషన్స్ డైరక్టర్‌గా వి.మోహన్‌రావు (ఆపరేషన్ సిజిఎం), హెచ్‌ఆర్ డైరక్టర్‌గా బి.అశోక్‌కుమార్ (మార్కెటింగ్ సిజిఎం)లను నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ సంస్థలను ప్రక్షాళ చేసే కార్యక్రమంలో భాగంగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌లో 7 మందిని, అదే విధంగా టిఎస్‌ఎన్‌పిడిసిఎల్‌లో నలుగురు డైరక్టర్లు మొత్తం 11మందికి ప్రపభుత్వం ఉద్వాసన పలుకుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
విద్యుత్ సంస్థల్లో సమ్మె నిషేధం
విద్యుత్ సంస్ఠల్లో ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి సమ్మెలు చేయకుండా ఆరు నెలల పాటు నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News