Thursday, January 23, 2025

కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్లపై వేటు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల వేళ రాష్ట్రంలో మరో ఇద్దరు అధికారులపై వేటు పడింది. ఇప్పటికే రాష్ట్రంలో 20 మంది ఐఎఎస్, ఐపిఎస్ అధికారులపై బదిలీ వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తాజాగా మరో ఇద్దరిపై బదిలీ వేటు వేసింది. కరీంనగర్ కలెక్టర్ గోపి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడుని బదిలీ చేస్తూ… ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వీరి ఆకస్మిక బదిలీకి గల కారణం తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో పలువురు అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో.. తాజాగా కరీంనగర్ జిల్లా అధికారులపై బదిలీ వేటు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. జిల్లా కలెక్టర్, కమిషనర్‌పై ఒకేసారి వేటు పడటం కరీంనగర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News