అసమ్మతిని తుంచేందుకు టిపిసిసి అప్రమత్తం
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా
క్రమశిక్షణ చర్యలు తప్పవు
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఎంపి సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌లో అసమ్మతి పెరుగుతున్న వేళ కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ లైన్ దాటుతున్న నేతలపై సీరియస్ అయ్యింది. ముదురుతున్న అసమ్మతిని మొగ్గ దశలోనే తుంచేసేందుకు టిపిసిసి అప్రమత్తమైంది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎమ్మెల్సీ,టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందే అన్నారు. అభిప్రాయాలను అంతర్గతంగా తెలియజేయాలని నేతలను ఆయన కోరారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ఎవరు మాట్లాడిన ఎంత సీనియర్ అయిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
లైన్ దాటితే వేటు తప్పదు…
- Advertisement -
- Advertisement -
- Advertisement -