Friday, December 20, 2024

పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించే నేతలపై వేటు?

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్న నేతల వల్ల పార్టీకి నష్టం కలుగకుండా చర్యలు

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయాన్ని ధిక్కరించే సాహసం పార్టీలో దాదాపుగా ఎవరూ చేయరు. ఒకవేళ అధినేత నిర్ణయాన్ని ధిక్కరించే నేతలపై సస్పెన్షన్ వేటు వేసేందుకు పార్టీ సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిని బుజ్జగిస్తూ, వారిని తమ దారిలోకి తెచ్చుకున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే తేల్చి చెప్పినట్లు తెలిసింది.

అన్ని విధాలా సమర్థులై క్రమశిక్షణ పాటించే అభ్యర్థులకే పార్టీ టికెట్లు కేటాయిస్తుందని, వివిధ సమీకరణల నేపథ్యంలో కొంతమంది కీలక నేతలకు ప్రస్తుతం టికెట్లు ఇవ్వలేకపోయినా భవిష్యత్తులో వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. బిఆర్‌ఎస్‌లో సీటు రాదని నిర్థారణ కావడంతో కొంతమంది అసమ్మతి నేతలు ఇతర పార్టీలోకి చేరుతున్న నేపథ్యంలో క్రమశిక్షణ ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. బిఆర్‌ఎస్‌ను వీడిన వారితో తమ పార్టీకి ఎలాంటి నష్టం కలుగకుండా వ్యూహాత్మకంగా కేడర్‌ను సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. బిఆర్‌ఎస్ పార్టీకి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే బలం అని, నాయకులు ఉన్నా..లేకపోయినా ఎలాంటి నష్టం లేదని సంకేతాలు పంపిస్తున్నారు. నాయకులతో సంబంధం లేకుండా కార్యకర్తలను పార్టీ కాపాడుకుంటుందని భరోసా కల్పిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News