Friday, April 11, 2025

‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ఈ మూవీ వండర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని హామీ ఇస్తుంది, కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News