Monday, December 23, 2024

5 గ్యారంటీలపై యాక్షన్ ప్లాన్

- Advertisement -
- Advertisement -

కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం

అసలైన లబ్ధిదారుల ఎంపిక విధానంపై చర్చ

ప్రజాపాలన దరఖాస్తుల నమోదులో ఎవరినీ ఒటిపి అడగలేదని మంత్రుల స్పష్టీకరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఐదు గ్యా రెంటీలు అమలు చేసేందుకు ప్రజాపాలన పేరుతో పేద ప్రజల నుంచి ఇటీవల పెద్ద ఎత్తున దరఖాస్తులు తీసుకుం ది. 10 రోజుల పాటు అధికారులు 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో నిజమైన లబ్ధిదారుల ఎంపిక కోసం ముగ్గురు మంత్రులతో కూడిన మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంఘం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ప్రజా పాలన సబ్ కమిటీ సమావేశానికి రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబుతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐదు గ్యారంటీల అమలు కోసం సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపి ప్రజాపాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి డాటా ఎంట్రీ ఎంత వరకు పూర్తయింది ఐదు గ్యారంటీలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల్లో గ్యారెంటీ వారిగా వచ్చిన అభ్యర్థనలు ఎన్ని వివరాలపై చర్చించారు.

సమావేశంలో సీనియర్ అధికారులు ఐదు గ్యారంటీల అమలు కోసం యాక్షన్ ప్లాన్ చేయడానికి వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఐదు గ్యారెంటీలు లబ్ధి పొందడానికి అసలైన దరఖాస్తుదారుల ఎంపిక విధానం గురించి డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. డేటాలో డూప్లికేషన్ లేకుండా సీజీజి, ఐటి శాఖతో పాటు మిగతా అన్ని శాఖలు సమిష్టిగా డేటాను షేర్ చేసుకొని శుద్ధమైన డేటాను సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశాలు ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తు డేటా సేకరణ, నమోదులో కానీ ఎవరు కూడా దరఖాస్తుదారుని ఒటిపి అడగలేదన్నారు. ఒటిపి అనే అంశం దరఖాస్తులోనే లేదని, ఎవరైనా సైబర్ నేరస్తులు ఫోన్ చేసి దరఖాస్తుదారులను ఒటిపి అడిగితే ఇవ్వవద్దు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరస్తులు అడిగే ఒటిపికి ప్రజాపాలనలో సేకరించిన దరఖాస్తులకు సంబంధం లేద ని తెలిపారు. ఐదు గ్యారంటీలకు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం తగదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని మంత్రులు పేర్కొన్నారు.
నిజమైన లబ్ధ్దిదారులను గుర్తించాలి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు తప్పుదోవ పట్టకుండా నిజమైన లబ్దిదారులను గుర్తించేందుకు అధికారులు చర్య లు తీసుకోవాలని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మీడి యా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ ప్రజాపాలన కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి ఎటువంటి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించలేదని, అధికారులు ఎటువంటి ఒటిడి అడగరని స్పష్టం చేశారు. డేటా ఎంట్రీ ప్రక్రియలో కూడా లబ్ధిదారుడి నుంచి ఫోన్ నెంబర్ తీసుకోలేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News