Monday, December 23, 2024

గురునానక్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, బల్మూర్ వెంకట్

ఇబ్రహీంపట్నం: గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని వసతి గృహాంలో వారితోపాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈసి శేఖర్‌గౌడ్ , ఏదుళ్ళ పాండురంగారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురునానక్ యాజమాన్యం సుమారు 4 వేల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు.

ఏలాంటి అనుమతులు రాకుండానే యూనివర్సిటీ పేరుతో అడ్మిషన్లు తీసుకొని 4 వేల మంది విద్యార్థుల వద్ద రూ.100 కోట్లను వసూలు చేసిందని అన్నారు. నేడు తీరా చూసే సరికి అనుమతులు లేదంటూ యాజమాన్యం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. వందలాది విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విబాగం అధ్యక్షులు బల్మూరి వెంకట్ గురునానక్ కళాశాలను సందర్శిస్తే ఆయనపై గుండాలతో దాడులు చేయించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. ఇప్పటికైనా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని కోరారు. సంబంధిత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించి యాజామాన్యంపై 420 కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

వారం రోజుల్లో విద్యార్థులకు న్యాయం చేయని ఎడల కాలేజీ గేట్ల ముందు టెంట్ వేసుకొని కూర్చోని విద్యార్థుల కుటుంబాలకు బాసటగా నిలుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంఖాల దాసు, మండల పార్టీ అధ్యక్షులు జెడల రవీందర్‌రెడ్డి, బస్కు నర్సింహ్మా, యువజన విభాగం రాష్ట్ర నాయకులు తాళ్ళ బాలశివుడు, నందకిషోర్, బ్లాక్ యువజన విభాగం అధ్యక్షులు మంఖాల కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News