Friday, December 27, 2024

సంపూర్తి చేయని గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

దోమకొండ: ప్రభుత్వ పనులు పూర్తిస్థాయిలో చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపిపి కానుగండి శారద, జెడ్‌పిటిసి తీగల తిర్మల్ గౌడ్ అన్నారు. దోమకొండ మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం తన అద్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల మరమత్తులు అసంపూర్తిగా చేసిన సదరు గుత్తేదారుతో మిగిలిన పనులు చేయించాలని అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండంతో అధికారులు చెరువుల తూముల లీకేజీలు, కాలువల పూడిక తీత పనులపై శ్రద్ధ వహించి, వాటిని గుర్తించి ఆ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మండలంలోని ప్రతి గ్రామంలో సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.

వర్షాకాల పంటలు వేయడానికి రైతులు సిద్ధ్దపడుతున్న వేళ వ్యవసాయ అధికారులు రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో వుంచాలన్నారు. రైతు సంక్షేమమంలో భాగంగా నకిలి విత్తనాలపై దృష్ఠిసారించి విత్తన షాపులలో తనిఖీలు చేపట్టాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు తీసుకోవలన్నారు. సీతారం పల్లి గ్రామమంలో రేషన్ షాప్ లేక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీతారం పల్లి గ్రామ సర్పంచ్ నాంపల్లి అధికారులకు తెలిపారు. అందుకు సమాధానంగా తాహశీల్దార్ కౌషిక సమాధానమిస్తు త్వరలో రేషన్ షాప్ ఏర్పాటుకు చర్యలు తీ సుకుంటామని తెలిపారు. గ్రామాలలో వ్యవసాయ బోరుబావుల వద్ద కరెంటు లూసు లైనులను గుర్తించి ప్రాణ నష్టం జరుగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటు లూసు లైనులను సరి చేయాలని కరెంటు ఏఇ ప్రదీప్‌కు సుచించారు.

ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్ పరిదిలోని భూమి ని కబ్జా నుండి విడిపించి ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్ స్థలమును కాపాడాలని జెడ్‌పిటిసి తీగల తిర్మల్ గౌడ్ ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. అంబారిపేట గ్రామ పంచాయితి భవన నిర్మాణం పై పలు విమర్శలు తలెత్తాయి, చర్చనీయామంశంగా మారింది. ఈ కార్యక్రమమంలో వైస్‌ఎంపిపి పుట్ట బాపురెడ్డి, దోమకొండ సొసైటీ చైర్మన్ నాగరాజు రెడ్డి, ముత్యంపేట సొసైటి చైర్మన్ తిరుపతి గౌడ్, సిడిసి చైర్మన్ ఐరేని నర్సయ్య, ఎంపిటీసిలు పిరంగి రాజేశ్వర్, నిమ్మశంకర్, కోట సదానంద, వెంకట లక్ష్మి, ఆసాని జ్యోతి, కోఆప్షన్ సబ్యుడు ఎండి శమ్మి, రైతు సమన్వయ సమితి అద్యక్షుడు తిరుపతి రెడ్డి, సర్పంచ్ లు నల్లపు అంజలి శ్రీనివాస్, నాంపల్లి, సాయిలు, నర్సవ్వ, ఏంపిడిఒ చిన్నారెడ్డి, ఎపిఒ తిరుపతిరెడ్డి, తాసీల్దార్ కౌషిక, మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, ఇరిగేషన్ డిఈ అర్చన, ఆర్‌అండ్‌బి డిఈ శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News