Saturday, December 21, 2024

టిపిసిసి చీఫ్ రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

సిఈవో వికాస్‌రాజ్‌కు కోరిన బిఆర్‌ఎస్ లీగల్ సెల్ బృందం
మంత్రి కెటిఆర్ నోటీసులకు త్వరలో వివరణ ఇస్తాం

మన తెలంగాణ/ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకులు రౌడీల్లా వ్యవహరిస్తూ ఇతర పార్టీల నాయకులు ప్రచారానికి వస్తే దాడులు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని సిఈవో వికాస్‌రాజ్‌కు బిఆర్‌ఎస్ లీగల్ బృందం ఫిర్యాదు చేసింది. ఆదివారం లీగల్ సెల్ నాయకుడు సోమా భరత్‌ కుమార్, జిహెచ్‌ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌తో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి తాము కోస్గిలో ఉంటున్న స్థలం వద్ద తమపై దాడి చేశారని బాబా ఫసియుద్దీన్ తెలిపారు. మొదట వారి నుంచి తప్పించుకొని పారిపోతుంటే తమని కార్లతో వెంబడించి దాడికి ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దేవుడు, అల్లా కరుణతో దాడి నుంచి బయటపడ్డానని,  కాంగ్రెస్ ఓడిపోతుందనే భావనతో ఉన్న రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి వీధి గుండాల్లా వ్యవహరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దాడి ఘటనపై పరిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నట్లు చెప్పారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులం మా ప్రాణాలు పోయినా బంగారు తెలంగాణ కోసం పోయిందనుకుంటామని, మా డ్రైవర్, గన్‌మెన్ సకాలంలో స్పందించపోయి ఉంటే తన ప్రాణాలు తీసేవారిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అదే విధంగా మంత్రి కెటిఆర్‌కు సిఈసి నోటీసులపై సోమా భరత్ స్పందిస్తూ ఇప్పటివరకు నోటీసులు మాత్రమే ఇచ్చారని కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు పత్రాలు ఇవ్వలేదన్నారు. త్వరలోనే సిఈసి నోటీసులకు వివరణ ఇస్తామని తెలిపారు. తమ అభ్యర్థులపై దాడులు జరిగినా, మేము ఫిర్యాదులు ఇచ్చినా ఈసిఐ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News