Sunday, December 22, 2024

రాంగోపాల్ వర్మ వివాదాస్పద చిత్రంపై చర్యలు తీసుకోవాలి: టిడిపి నేత ప్రొ. జ్యోత్స్న

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ‘వ్యూహం’ పేరిట వివాదాస్పద చిత్రంపైనా, ఆ సినీ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపైనా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం కమాండ్ కంట్రోల్ రూం కార్యాలయంలో ఆయనకు ఒక వినతిపత్రం అందజేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు, నారా లోకేష్ తదితరులకు వ్యతిరేకంగా..రాంగోపాల్‌వర్మ అనే వ్యక్తి తను చేస్తున్న ట్వీట్ల ద్వారా తన కుళ్లు బుద్ధిని.. తనకున్న కుయుక్త బుద్ధిని.. తనకున్న కుసంస్కారాన్ని రోజురోజుకు బహిర్గతపరుచుకుంటున్నారన్నారు. ఇలాంటి వారిని భరించాలా? అనే అలోచన సమాజంలో వస్తున్నదని, యువతను తప్పు దారి పట్టిస్తూ ఆతను మాట్లాడిన మాటలను అధికారులు, పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

పక్క వారిని కించపరుస్తుండడమే రాంగోపాల్ వర్మకు మనుగడగా కనిపిస్తోందని, ఐడెంటిటీ క్రైసిస్‌లో బతుకుతున్న వ్యక్తి రాంగోపాల్ వర్మ… ఎవరైనా పెద్దవారిని టార్గెట్ చేయకపోతే తన ఐడెంటిటీ కనపడదేమో అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాంగోపాల్ వర్మ  చేష్టల వల్ల, ట్వీట్‌ల వల్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అభిమానులకు కావచ్చు… తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభిమానులకు కావచ్చు.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులకు కావచ్చు.. అందరికీ ఇబ్బంది కలుగుతోందన్నారు. విద్వేషపూరితంగా చేస్తూ,  హింసను ప్రేరిపిస్తున్న ఆ సినిమాను రాకుండా చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News