Monday, December 23, 2024

డిజిపి సలహా మేరకే నిర్ణయం తీసుకుంటాం: ఎస్పీ కృష్ణకాంత్

- Advertisement -
- Advertisement -

కర్నూల్: వైసిపి ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిబిఐ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎస్పీ కృష్ణకాంత్‌తో సిబిఐ అధికారులు చర్చలు జరిపారు. అయితే దీనిపై ఎస్పీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా డిజిపి సలహా తీసుకుని నిర్ణయం తీసుకుంటామని సిబిఐ అధికారులు తెలిపారు. కాగా వైకాపా కార్యకర్తలు విశ్వభారతి ఆసుపత్రి వద్దే బైఠియించారు. కేంద్ర బలగాల సాయంతో అవినాశ్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 27 వరకు మినహాయింపునివ్వాలని అవినాశ్ రెడ్డి సిబిఐ అధికారులకు లేఖ రాశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్నందున తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీంకోర్టు వేకేషన్ బెంచ్ నిరాకరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News