Saturday, November 16, 2024

వరద ప్రాభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు

- Advertisement -
- Advertisement -
జిల్లా పోలీస్ అధికారులతో డిజిపి అంజనీ కుమార్ టెలీ కాన్ఫరెన్స్

హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వాళ్ళ సామాన్య ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను డిజిపి అంజనీ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వర్ష ప్రభావిత ప్రాంతాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డిజిపి శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రణాళికా బద్దంగా పని చేయాలన్నారు. వర్షాల ప్రభావం, వరద పరిస్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రజలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్య పర్చాలని సూచించారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వరద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో పోలీస్ శాఖ నుండి ప్రజలు తగు సహాయ సహకారాలకై ఎదురుచూస్తారని అన్నారు. ఈ పరిస్థితుల్లో తమ నాయకత్వ ప్రతిభను చూపించి ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగ కుండా చూడాలని పేర్కొన్నారు. ఈ సందర్బంగా భద్రాద్రికొత్తగూడెం లోఉన్న ఐజి చంద్రశేఖర్‌రెడ్డితో మాట్లడి పరిస్థితిని సమీక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News