Monday, January 20, 2025

ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి చర్యలు : సుభాష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని కాలనీల్లో నె లకొన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చే స్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. గురువారం కాప్రా డివిజన్ పరిధిలోని కందిగూడ, వల్వర్‌నగర్, సాయిబాబ టెంపుల మేరి మాత టెం పుల్ తదితర కాలనీల్లో అధికారులు కాలనీవాసులతో కలిసి మీకోసం మీ ఎమ్మె ల్యే కార్యక్రమంలో భాగంగా కాలనీల్లో సుభాష్‌రెడ్డి పాదయాత్ర చేశారు. ప్రతి ఇంటివద్ద అగి సమస్యలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. చర్చిలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు. కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసమే కాలనీల్లో పాధయాత్ర చేస్తున్నానని తెలిపారు. అనంతరం సైనిక్‌పురి సబ్‌స్టేషన్ వద్ద టిపిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కాప్రా, మీర్‌పేట్ హెచ్‌బికాలనీ డివిజన్ కార్పొరేటర్లు స్వర్ణరాజు, జేరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి దన్‌పాల్‌రెడ్డి, వివిధ విభాగాల అధికారులు, కాప్రా పార్టీ డివిజన్ అధ్యక్షుడు సుడుగు మహేందర్‌రెడ్డి, గిల్‌బర్ట్ ఉప్పల్ నియోజకవర్గంలోని పది డివిజన్లకు చెందిన బిఅర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News