Monday, December 23, 2024

ఉప్పల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి చర్యలు : సుభాష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గం పరిదిలోని అన్ని కాలనీల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని పరిక్షరించేందుకు కాలనీల్లో పాదయాత్ర చేస్తున్నమని ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం 19వ రోజు మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ డివిజన్ పరిదిలోని అన్నపూర్ణకాలనీ, నర్సింహ్మనగర్‌కాలనీ, జయశంకర్‌కాలనీ, లక్ష్మినగర్‌కాలనీ, ఎన్టీఅర్‌నగర్ తదితర కాలనీల్లో అధికారులు కాలనీవాసులతో కలసి మీకోసం మీ ఎమ్మేల్యే కార్యక్రమంలో భా గంగా కాలనీల్లో మీర్‌పెట్ హెచ్‌బి కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపుశ్రీనిఒవాస్‌రెడ్డిలతో కలసి సుభాష్‌రెడ్డి పాదయాత్ర చేశారు. ప్రతి ఇంటివద్ద అగి సమస్యలు, యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పరిక్షరించారు.

అనంతరం అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలను వెంటనే పరిక్షరించాలని అదేశించారు. ఈసందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ కాలనీల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిక్షరిస్తానని తెలిపారు. కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిక్షరం కోసమే కాలనీల్లో పాధయాత్ర చేస్తున్ననని తెలిపారు. అనంతరం టిపిపిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబోమ్మను దహనం చేశారు. ఈకార్యక్రమంలో వివిద విభాగాల అధికారులు, పది డివిజన్లకు చెందిన బిఅర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News