Friday, January 10, 2025

పార్కు స్థలాల పరిరక్షణకు చర్యలు

- Advertisement -
- Advertisement -
  • మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి

కీసర: నాగారం మున్సిపాలిటీ పరిధిలో పార్కు స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి అన్నారు. బుధవారం 5వ వార్డులో రూ.4 లక్షల మున్సిపల్ నిధులతో చేపట్టిన పార్కు ప్రహారీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ప్రజా అవసరాల కోసం వదిలిన పార్కు స్థలాలను పరిరక్షిస్తూ కంచె, ప్రహారీ నిర్మాణాలు చేపడుతున్నామని, ఇందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పార్కు స్థలాలలో మొక్కలు నాటి సందరీకరించి పిల్లల ఆట వస్తువులు, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ బి.మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు అన్నంరాజు లావణ్య శ్రీనివాస్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News