Thursday, January 23, 2025

ఇంటర్ మూల్యాంకణం విధులపట్ల నిర్లక్షంచేస్తే చర్యలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ రూరల్: ఇంటర్ అడ్వాన్స్, సప్లమెంటరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకణం రెండో స్పెల్ ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతోందని జిల్లా విద్యాశాఖాధికారి రఘురాజ్ తెలిపారు. ఈ మూల్యాంకణంలో భౌతికశాస్త్రం, అర్థశాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం జవాబుపత్రాల మూల్యాంకణం ప్రారంభమవుతుందని తెలిపారు అలాగే 26న మూడవ స్పెల్‌లో రసాయనశాస్త్రం, వ్యాపార గణకశాస్త్రం, చరిత్ర సబ్జెక్లు పత్రాల మూల్యాంకణం ప్రారంభమవుతుందని తెలిపారు. గత మార్చి నెలలో విధులకు హాజరుకావాలని వచ్చిన ఆర్డర్ కాపీల ఆధారంగానే జూనియర్ కళాశాలల అధ్యాపకులు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఈ మూల్యాంకన విధుల్లో పాల్గొనాలని సూచించారు.

ప్రభుత్వ, ఎయిడెడ్,అన్ని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్‌లు వారి కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులను ఆయా తేదీల ప్రకారం ఒకరోజు ముందుగానే రిలీప్ చేయాలని ఆయన ఆదేశించారు. మూల్యాంకణ విధుల్లో పాల్గొనకుండా నిర్లక్షం వహించే అధ్యాపకులపైన, ఆయా కళాశాలల యాజమాన్యం ప్రిన్సిపాల్‌లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ఇంటర్‌బో ర్డు కమిషనర్‌కు తెలియచేయడం జరుగుతుందని తెలిపారు. గత మార్చి నెలలో మూల్యాంకన విధుల్లో పాల్గొనని అధ్యాపకులపై ఇదివరకే ఇంటర్ బోర్డు కమిషనర్‌కు ఫిర్యాదుచేయడం జరిగిందని, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సప్లమెంటరీ జవాబుపత్రాల మూల్యాంకణం విధుల్లో పాల్గొనని అధ్యాపకులపై, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌లపైనా విధి నిర్వహణలో నిర్లక్షం వహించే వారిపై ఇంటర్ బోర్డు తీసుకునే క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News