Wednesday, November 13, 2024

బాల్య వివాహ నిషేద చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ : బాల్య వివాహాల నివారణ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జూలై మాసంలో నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా అధికారుల నిర్దేశించి మాట్లాడుతూ జీవితంలో బాల్యం చాలా గొప్పదని, బాల్యం లేకుంటే ఎంతో కోల్పోయిన వారవుతారని అన్నారు. జిల్లాలో జూలై 31లోపు అధికారులు, పోలీసు, స్వచ్ఛంద సంస్థలు, పిల్లల సంక్షేమ కమిటీ, చైల్డ్ లైన్ ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి బాల కార్మికులు లేకుండా కృషి చేయాలన్నారు. జిల్లాకు చెడ్డ పేరు లేకుండా, చట్టానికి అనుకూలంగా సవాల్ గా తీసుకొని తలెత్తుకొని పనిచేసేలా ముందుకు రావాలని ఆయన అన్నారు.

పిల్లలకు మంచి జీవితాన్ని ఇస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కటువుగా వ్యవహరించవలసి ఉంటుందని, ఏదైనా సమస్యలు సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగం తరపున కచ్చితంగా మద్దతు ఉంటుందని కలెక్టర్ సందర్భంగా తెలిపారు. తప్పిపోయిన పిల్లల విషయంలో చైల్డ్ లైన్ ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పని చేయాలన్నారు. జూలై 9న జరిగే సమావేశానికి గత విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివి పై చదువులకు వెళ్ళని విద్యార్థినీల జాబితాలో సేకరించాలని డిఈఓ, డిడబ్ల్యుఓ కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో బాల్యవివాహాలను అరికట్టేందుకు చట్టం పరిధిలో అందరూ పనిచేయాలని, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషించాల్సి వస్తుందని తెలిపారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా సంబంధిత పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తప్పవని హెచ్చరించారు. బడీడు పిల్లందరు చదువును అభ్యసించే విధంగా పునరావాస కేంద్రాల తరలించి పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో డీఈవో రేణుకాదేవి, బిడబ్ల్యుఓ లలితకుమారి, డిఆర్‌ఓ అశోక్‌కుమార్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, డిఎంహెచ్‌ఓ పవన్‌కుమార్, పిల్లల సంక్షేమ కమిటీ చైర్మన్ వెంకటేష్, అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, మురళీధర్, పోలీస్ ఇన్స్పెక్టర్ దాసు, చైల్ లైన్ ప్రతినిధులు శ్రీనివాస్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వికలాంగులు, వయోవృద్ధులు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ రూపొందించిన మాదక ద్రవ్యాలతో మసి వాటిని మానేస్తే జీవితం ఖుషి, మాదక ద్రవ్యాలతో జీవితం నరకం వద్దు… మాదక ద్రవ్యాల వాడకం నినాదాలతో రూపొందించిన మిషన్ పరివర్తన గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News