Monday, December 23, 2024

ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే చర్యలు

- Advertisement -
- Advertisement -

Actions if free left is blocked Says Joint CP Ranganath

తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద పరిశీలించిన జాయింట్ సిపి రంగనాథ్

హైదరాబాద్: ఫ్రీ లెఫ్ట్ బ్లాక్, స్టాప్ లైన్‌ను క్రాస్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ తెలిపారు. నగరంలోని మోనప్ప జంక్షన్, ఖైరతాబాద్ వివి స్టాట్యూ జంక్షన్, తెలుగు తల్లి జంక్షన్, అంబేద్కర్ స్టాట్యూ జంక్షన్‌లను జాయింట్ సిపి రంగనాథ్, డిసిపి ప్రకాష్ రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. వాహనదారులు పోతున్న విధానాన్ని పరిశీలించారు. వాహనదారులు ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్ చేయడం, స్టాప్ లైన్‌ను క్రాస్ చేయడంతో ట్రాఫిక్‌కు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని జాయింట్ సిపి రంగనాథ్ అన్నారు. వాహనదారులకు ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిహెచ్‌ఎంసి అధికారులు, ఇంజనీరింగ్ సెల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వాహనదారులు ఫ్రీగా లెఫ్ట్ సైడ్ వెళ్లేందుకు బొల్‌లార్డ్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News