Wednesday, January 22, 2025

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : ప్రభుత్వ స్థ లంలో వెలసిన అక్రమ గుడిసెలను కాప్రా మండల తహసీల్దార్ ఎస్తేర్ అనిత ఆదేశాల మేరకు బుధవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుందతినగర్‌లో సీఆర్‌పిఎఫ్ గేట్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో కొంతమంది వ్యక్తులు రా త్రికే రాత్రి గుడిసెలు వేసుకోని ఉన్నారు.ఈ వి షయం తెలుసుకున్న కాప్రా మండల గిర్దావర్ వి శ్వనాథ్ జవహర్‌నగర్ పోలీసుల సహాకారంతో గు డిసెలను తొలగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గుడిసెలుగాని,నిర్మాణాలు గాని చేపడితే క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు.ప్రజలు ద ళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించా రు.ఇండ్లు లేని వారు ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకోవాలని సూచించారు.లక్ష్మీనరసింహ కాలనీలోని సర్వే నెంబర్ 696లో నిర్మించిన గదిని జెసిబితో తొలగించారు.ఈ కూల్చివేతలో వీఆర్‌ఏలు నాగరాజు,రాజు పాల్గొన్నారు.
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం : బిజెపి
కుంటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న బాధితులకు ప్రభుత్వం గతంలో ఈ స్థలం కేటాయించిందని,ఆర్థిక ఇబ్బందులతో కట్టుకోలేక ప్ర స్తుతం గుడిసెలు ఏర్పాటు చేసుకుంటే రెవెన్యూ అ ధికారులు కూల్చివేయడం ఎంత వరకు సమంజసమని బిజెపి నాయకులు ప్రశ్నించారు.గుడిసెలు తొలగించిన విషయం తెలుసుకున్న స్థానిక బిజెపి అధ్యక్షుడు రంగుల శంకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర నా యకులు కొంపెల్లి మోహన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు.బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి సింగిరెడ్డి హ రివర్ధన్‌రెడ్డి బాధితులను పరామర్శించి,ప్రభుత్వమే పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News