- Advertisement -
ఇసి పేరిట నకిలీ పత్రాల సృష్టిపై చర్యలు
న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘంలో పిఐఒ పేరిట అధికారి ఎవరూ విధులు నిర్వహించడం లేదని ఇసి స్పష్టం చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేరిట పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పిఐఒ) గురుప్రీత్ సింగ్ సంతకంతో పేరిట ఆర్‌టిఐ పేరిట నకిలీ పత్రాల సృష్టించినట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అదికారులను ఇసి ఆదేశించింది. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఇసి తెలిపింది. ఇసి ఆదేశాల మేరకు సిఇఒ శశాంక్ గోయల్ మెమో జారీ చేశారు. నకిలీ పత్రాల సృష్టిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలనిచర్యలు తీసుకోవాలని డిజిపి, కరీంనగర్ కలెక్టర్, కరీంనగర్ సిపికి, హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారికి సిఇఒ ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -