Saturday, December 21, 2024

జిల్లాలో మాదకద్రవ్యాల ఉత్పత్తి వాడకంపై చర్యలు

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : జిల్లాలో మాదకద్రవ్యల ఉత్పత్తి వాడకంపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా స్థాయి ఎ న్కార్డ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లా కలెక్టర్ జిల్లాలో మాదక ద్ర వ్యాల కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై డ్రగ్స్ చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు సమర్థవంతమైన నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర సరిహద్దులు చెక్ వెంబడి చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేయాలన్నారు.

నార్కోటిక్స్ డ్రగ్స్ నివారించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సిబ్బంది ఖచ్చితమైన నిఘాను నిర్వహించడం అన్ని సమయాలలో ప్రామాణిక కార్యాచరణ విధానాలను అనుసరించడం చాలా అవసరమని అన్నారు. నారాయణపేట జిల్లాను కమిటీ సభ్యులందరూ సంబంధిత శాఖల స మన్వయంతో నార్కోటిక్స్ డ్రగ్స్ లేకుండా చూడాలని నొక్కి చెప్పారు. ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని విద్యాసంస్థలు గ్రామస్థాయి కమిటీలతో పోలీసుల సహయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

డ్రగ్స్, సిగరెట్ , గుట్కా వాటిపై విద్యార్థులకు ప్రజలకు అవగాహన క ల్పించేందుకు షీ టీంలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జి ల్లాలో నిరంతరం దాడులు నిర్వహిస్తున్నట్లు పోలీసులతో సమన్వయం చేసుకొని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో ఆర్డీఓ రాంచందర్, డిఎస్పీ సత్యనారాయణ, ఆర్టీఓ వీరస్వామి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, డిఎంహెచ్‌ఓ డాక్టర్ రాంమనోహర్‌రావు, జగదీష్, రియాజ్‌హుసెన్, రవి, నారాయణరావు, నర్సింహరెడ్డి, పోలీస్ అధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News