ఆసిఫాబాద్ : జిల్లాలో విద్యారంగం అభివృద్ధి దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలంలోని రౌటసంకపల్లి గ్రామంలోని శాటిలైట్ సెంటర్ పాఠశాలను ఆకస్మీక తనిఖి చేసి విద్యార్థులకు కంప్యూటర్‌పై ప్రాథమిక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ అభివృద్ధ్ది కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని విద్యాశాఖ, అనుబంధ శాఖల సమన్వయంతో మారుమూల ప్రాంతాలలో సైతం విద్యార్థులకు విద్య అందించేందుకు చర్యలు చేపడు తున్నామని తెలిపారు. మెంగుడుబాయిగూడ గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రాన్ని సందర్శి ంచి రికార్డులను పరిశీలించారు.
పిల్లలకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలని, పిల్లల బరువు, ఎత్తు, ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసు కోవాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమ అభివృద్ధ్ది పనులను పరిశీలించారు. పెండింగ్ ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో మంజూరు అయిన ట్యాబ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.