Monday, December 23, 2024

రోడ్లపై డబ్బాలు, తోపుడు బండ్లు పెడితే చర్యలు

- Advertisement -
- Advertisement -

కొత్తకోట : రోడ్లపై డబ్బాలు, తోపుడు బండ్లు పెడితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన తిరిగి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెఉజ్ మార్కెట్లను ఆయన పరిశీలించి రోడ్లపై విస్తరిస్తున్న సెంటర్ మీడియన్ సిసి రోడ్డు డ్రైవ్ పనులను, ఇందులో రోడ్డు జంక్షన్ నుంచి హైదరాబాద్, వనపర్తి, కర్నూల్, మదనాపురం రోడ్లపై వెలిసిన డబ్బాలను, తోపుడు బండ్లను తొలగించాలని ఆదేశించారు. ఒక స్పెసల్ ఇంక్రాస్‌మెంట్ టీంను నియమించి అక్రమాలు తొలగించాలని ఆదేశించారు.

అనంతరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రార్థన సమయంలో విద్యార్థులచే ప్రార్థన చేయించారు. అనంతర బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి తెలుగు మీడియం విద్యార్థులకు గణిత శాస్త్రాన్ని బోధించారు. అనంతరం విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి బోర్డుపై సమాధానం రాబట్టారు. అందరు విద్యార్థులు చక్కగా సమాధానాలు చెప్పడంతో వారిని అభినందించి నోట్‌బుక్కులను బహుమతిగా అందజేశారు.

అనంతరం మున్సిపల్ కార్లాయీయంలో కార్మికును ఉద్దేశించి మాట్లాడుతూ శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, పట్టణం పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలంలో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కార్మికులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుకేషిని, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, తహసిల్దార్ బాల్ రెడ్డి, ఎస్సై మంజునాథ రెడ్డి, పట్టణ ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News