Friday, December 20, 2024

అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు

- Advertisement -
- Advertisement -

బైంసా : అక్రమంగా మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో గురువారం అక్రమంగా పట్టుబడ్డ పలు ద్విచక్రవాహనాలకు బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్బంగా 5 ద్విచక్ర వాహనాలకు వేలం పాట చేయగా 32 వేలు వచ్చాయని ఆయన చెప్పారు. అయితే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈ విధంగా చెబుతుండగా భైంసా డివిజన్ పరిధిలోని పలు పర్మిట్ రూముల్లో అర్ధరాత్రి నుండి ఉదయం 10 గంటల వరకు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు.

అధిక ధరలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా డివిజన్‌లో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతుంది. కల్తీ కల్లుతో పలు కుటుంబాలు రోడ్డున పడడమే కాకుండా కల్తీ కల్లు ప్రియులు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇటువైపు సూపరింటెండెంట్ దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. వేలం పాట కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ నజీర్, టాస్క్‌ఫోర్స్ సిఐ సుందర్ సింగ్, ఎస్‌ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News