Thursday, January 23, 2025

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే సీతక్క

ములుగు జిల్లా ప్రతినిధి: కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం ములుగు మండలంలోని అబ్బాపూర్ గ్రామంలో పలువురు బిఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు అధైర్య పడవద్దని, అధికార పార్టీ నాయకుల కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేస్తారని అన్నారు. బిఆర్‌ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా నా విజయాన్ని ఆపలేరని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, బిసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, ఉపాధ్యక్షుడు పల్లె జయపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు చాంద్ పాషా, నల్లెల్ల భరత్, ఆనందం, మొగిళి, చింతనిప్పుల భిక్షపతి, ఓం ప్రకాష్, గందె శ్రీను, బిక్షపతి, శంకరయ్య, కుమార్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News