Wednesday, January 22, 2025

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యమకారులకు గుర్తింపు

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యమకారులకు గుర్తింపు వస్తుందని పిసిసి సభ్యుడు పెండెం రామానంద్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్యగౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్రం కోసం విషం మింగి బతికున్న దండెం రతన్‌కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరుల ఆశయాలకు గంతలు కట్టిందని కళ్లకు గంతలు కట్టుకొని అ మరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తున్న ఉద్యమకారున్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అరెస్టు చేయించడాన్ని ఖండించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరసనలతో ఏర్పడ్డ రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసే హక్కును కాలరాస్తున్న ప్రభుత్వ తీరు, పోలీసుల నిర్బంధాలను దు య్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు గాలికి వదిలి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ సీఎం కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లకు పడగలెత్తిందని, తుది దశ తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమకారులు ఏకం కావాలని తెలంగాణకు ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభు త్వంలోనే గౌరవం గుర్తింపు దక్కుతుందన్నారు.

బిఆర్‌ఎస్ కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఫీజు రీఎంబర్స్‌మెంటు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, 12 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు, 12 శాతం గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు. 1200 మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన మనస్సు చలించి ఎంతో మంది తల్లుల ఆత్మఘోష చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కాట ప్రభాకర్, ముల్కల సాంబయ్య, రవికుమార్, వంశీకృష్ణ, సారంగంగౌడ్, సందీప్, నాగ, వెంకటేశ్, రవికుమార్, మురళి, మనీష్, నర్సింహారెడ్డి, బాబా, సాయికిరణ్, సాయిశ్రవణ్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News