Monday, December 23, 2024

కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు

- Advertisement -
- Advertisement -

ఇల్లంతకుంట: కార్యకర్తలే బీఆర్‌ఎస్ పార్టీ కీ పట్టుకొమ్మలని, నాటి తెలంగాణ ఉధ్యమం నుండి వెనకడు వేయకుండా స్వరాష్ట్రం కోసం, నేడు అభివృద్ది కోసం భాగస్వాములు అవుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు బోయినపెల్ల వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ లు అన్నారు. సోమవారం మండలంలోని రేపాకలో మండల స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని పార్టీ అధ్యక్షుడు పల్లే నర్సింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు.

ఈ సంధర్భంగా బోయినపెల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం కార్యకర్తలు శ్రమకు మించి కష్టపడుతున్నారని, పదవులు ఉన్నా, లేకున్నా కూడా బీఆర్‌ఎస్ పార్టీ గెలుపుకృషి చేస్తున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరి కి పదవులు దక్కుతాయన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ తెలంగాణ ఉధ్యమంలో కాలీకి గజ్జకట్టి, జబ్బకు గొంగడేసుకుని ఊరురా స్వరాష్ట్రం కోసం పాటలు పాడనన్నారు.

రెండు సార్లు మానకొండూర్ నియోజకవర్గం ప్రజలు నన్ను భారీ మోజార్టీతో గెలిపించిన మీ రుణం ఎప్పటికి తీర్చుకోలేనన్నారు. రానున్న ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీదే గెలుపని, సిఎం కేసిఆర్ చేపట్టుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో కి వెళ్తున్నాయన్నారు. ప్రతి పక్షాలు మాట్లాడితే..పాలక పక్షం అభివృద్ది చేసి చూపిస్తున్నామన్నారు. నాటి పాలకులు వ్యవసాయం దండగ అంటే నేడు పండగల చేసిచూపించామన్నారు.

రేపాక గ్రామానికి చెందిన 20మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరిని కండువాలు కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు, రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తొట ఆగయ్య, జడ్పీవైస్ చైర్మన్ సిద్దంవేణు, ఎంపిపి వుట్కూరి వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి సంజీవ్, వైస్ ఎంపిపి సుధగోని శ్రీనాథ్‌గౌడ్, ఫోరం అధ్యక్షుడు చల్లనారాయణ, మహిళ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మీ, సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్తకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News