Monday, December 23, 2024

షర్మిలకు నిరసన సెగ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ వ్యవస్థాపకురాలు వైఎస్.షర్మిలను పోలీసులు ఆదివారం ఆరెస్టు చేసి హైదరాబాదుకు తరలించారు. ఈ మేరకు ఆమె పాదయాత్ర గత రెండు రోజులుగా మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతుంది. శనివారం సాయంత్రం మా నుకోటలో జరిగిన పాదయాత్రలో ఆమె స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ దంపతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బిఆర్‌ఎస్ శ్రేణుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. షర్మిల చేసిన వ్యాఖ్యలు తమ నేత మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున షర్మిల బస చేసిన ప్రాంతానికి వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మరోవైపు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రైసిడెంట్ లూనావత్ అశోక్‌నాయక్ తమ ఎమ్మెల్యే దంపతులపై షర్మిల చేసిన తీవ్ర అరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలంటూ మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఆమె పాదయాత్ర ముందుకు కొనసాగితే శాంతభద్రతలకు విఘాతం కలుగుతుందన్న నేపథ్యంలో పోలీసులు ఆమె పాదయాత్ర అనుమతి రద్దు చేశారు. ఆమెపై స్థానికంగా కేసులు నమోదు చేయడంతో పాటు తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆమెను అరెస్టు చేసి పోలీసు వాహనంలో హైదరాబాదుకు తరలించారు.

దాడిని గవర్నర్ దృష్టికి తీసుకుపోతా : షర్మిల

పాదయాత్ర సందర్భంగా తనపై జరిగిన దాడిని రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుపోనున్నట్టు వైఎస్‌ఆర్‌తెలంగాణ పా ర్టీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఆదివారం పార్టీ కా ర్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌నేతలు తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అణిచివేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే మహిళలపైఇంత నీచంగా మాట్లాడిస్తారా అని ప్రశ్నించారు. శంకర్ నాయ క్ తనపై దాడికి ప్లాన్ చేశాడన్నారు. త్వరలోనే గవర్నర్‌ను కలిసి అన్ని అంశాలను వివరిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News