Thursday, January 23, 2025

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

- Advertisement -
- Advertisement -
  • ఎంఎల్‌ఎ బాల్కసుమన్

కాసిపేట: రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రతి కార్యకర్త ఒక సైనికుని వలే పని చేయాలని చెన్నూర్ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం మందమర్రి రెండవ జూన్ బత్తుల శ్రీనివాస్ ఇంటి వద్ద మందమర్రి మున్సిపాలిటి, మందమర్రి మండల ముఖ్యనాయకుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఎంఎల్‌ఎ సుమన్ మాట్లాడుచు తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఆయన సూచించారు. చెన్నూర్ నియోజక వర్గంలో అనాది కాలంగా లేని అభివృద్ధిని తన హయాంలో చేయడం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలే కాకుండా ప్రజలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అందించడం జరిగిందన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు తెలంగాణ అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్లిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ది విషయాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని ఆయన సూచించారు.

మూడో సారి తెలంగాణ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేయాలని ఆయన సూచించారు. చెన్నూర్‌లో మరో సారి బిఆర్‌ఎస్ జెండా ఎగుర వేయాలని అందుకు అందరు సహాకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు జె. రవీందర్, బత్తుల శ్రీనివాస్, ప్రభాకర్‌రావు, మేడిపల్లి సంపత్, కెంగర్ల మల్లయ్య పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News