Monday, December 23, 2024

ఎల్గార్ పరిషద్ కేసులో గొంజాల్వేస్, ఫెరీరాలకు బెయిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితులుగా ఉన్న హక్కుల కార్యకర్తలు వర్మన్ గొంజాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ ంజూరు చేసింది. గడచిన ఐదేళ్లుగా వీరిద్దరూ జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

గొంజాల్వేస్, ఫెరీరాకు బెయిల్ మంజూరు చేస్తూ వీరిద్దరూ మహారాష్ట్రను విడిచి వెళ్లకూడదని, తమ పాస్‌పోర్టులను పోలీసులకు స్వాధీనం చేయాలని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం  ఆదేశించింది. చెరో మొబైల్ ఫోన్‌ను మాత్రమే ఉపయోగించాలని, తమ నివాస చిరునామాలను ఎన్‌ఐఎకి తెలియచేయాలని కూడా వీరిద్దరినీ ధర్మాసనం ఆదేశించింది.

తమ బెయిల్ దరఖాస్తులను తిరస్కరిస్తూ బొంబాయి హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను ఈ ఇద్దరు హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 2017 డిసెంబర్ 31న పుణెలో జరిగిన ఎల్గార్ పరిషద్ సదస్సుకు మావోయిస్టులు నిధులు సమకూర్చినట్లు పుణె పోలీసుల ఆరోపణపై ఈ కేసు నమోదైంది. ఆ సదస్సులో రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రసంగాలతో మరుసటి రోజు పుణెలోని కొరెగావ్-భీమా యుద్ధ స్మారకం వద్ద హింస చెలరేగినట్లు పోలీసులు ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News