Monday, January 20, 2025

బాలీవుడ్ లో మరో విషాదం.. యువ నటుడు అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

ముంబై: బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మోడల్, యువ నటుడు ఆదిత్య సింగ్ రాజ్ పుత్(32) బాత్ రూమ్ లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ముంబై పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలో ఓషివారా ప్రాంతంలోని ఉన్న లష్కరియా హైట్స్ అపార్టుమెంట్ లోని 11వ అంతస్తులో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం తన ప్లాట్ లో బాత్ రూమ్ లో విగతజీవిగా పడి ఉన్న ఆదిత్యను చూసిన స్నేహితుడు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఆదిత్య మరణానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే, అనుమానాస్పద డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్లే ఆదిత్య చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య పోస్ట్ మార్టం నివేదికగా ఆదారంగా దర్యాప్తు ప్రారంబించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ లో జన్మించిన ఆదిత్య ఢిల్లీలో ఉంటూ మోడలింగ్ కమ్ యాక్టర్ గా తన కెరీర్ ప్రారంభించాడు. తర్వాత పలు టీవీ షోలతోపాటు సినిమాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News