Monday, December 16, 2024

పుష్ప 3.0

- Advertisement -
- Advertisement -

అల్లు అర్జున్ అరెస్టు.. రిమాండ్.. బెయిల్..

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో రోజంతా నాటకీయ పరిణామాలు.. బెయిల్ వచ్చినా జైలులోనే..

అల్లు అర్జున్‌ను మధ్యాహ్నం ఆయన ఇంట్లోనే అరెస్టు చేసిన పోలీసులు
చిక్కడపల్లి ఠాణాకు తరలింపు అల్లు అర్జున్ స్టేట్‌మెంట్ రికార్డు గాంధీ
ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు
14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం చంచల్‌గుడా జైలుకు
తరలింపు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన
హైకోర్టు రూ.50వేల సొంత పూచీకత్తు సమర్పించాలని షరతు
అర్నాబ్ గోస్వామి కేసులో బాంబే హైకోర్టు తీర్పు ఆధారంగా ఉత్తర్వులు
ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారించిన కోర్టు సంధ్య
థియేటర్ యాజమాన్యానికి ఇదే తీర్పు వర్తిస్తుందన్న ఉన్నత న్యాయస్థానం
రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని సూచన క్వాష్
పిటిషన్‌పై విచారణ రెండువారాలకు వాయిదా బెడ్‌రూంలోకి వస్తారా?
పోలీసులపై అల్లు అర్జున్ అసహనం తండ్రి అరవింద్‌ను పోలీస్ వ్యాన్
నుంచి దింపేసిన అర్జున్ దురుసుగా ప్రవర్తించలేదు.. ఆయన బయటకు
వచ్చాకే అరెస్టు చేశాం : డిసిపి ఆకాంక్ష్ యాదవ్

సంధ్య థియేటర్ ఘటనపై రోజంతా నాటకీయ పరిణామాలు
రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్టు….రిమాండ్…. బెయిల్‌లు గంటల వ్యవధిలోనే సాగిపోయాయి. నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు పర్వం కొనసాగినా రాత్రి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో హీరోకు పెద్ద ఊరట లభించింది. సినీ హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. సంధ్యథియేటర్‌లో ఏర్పాటు చేసిన బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ రేవతి మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై చిక్కడపల్లి పోలీసులు థియేటర్ యాజమానులు, మేనేజర్లు, హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు థియేటర్ యాజమాన్యం నిర్లక్షం, సినీ హీరో అల్లు అర్జున్ అనుమతి లేకుండా రోడ్ షో చేయడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు తేల్చారు. ఈ క్రమంలోని థియేటర్ యజమాని, ఇద్దరు మేనేజర్లును చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తర్వాత అల్లు అర్జున్ శుక్రవారం ఇంటి అదుపులోకి తీసుకుని, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

స్టేషన్‌లో అల్లు అర్జున్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు చెప్పి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపర్చడంతో విచారణ చేసిన కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు చిక్కడపల్లి పోలీసులు తరలించారు. ఇదిఇలా ఉండగా మధ్యాహ్నం హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన అల్లు తరఫు న్యాయవాదులు మధ్యంతర బెయిల్ కోసం అప్పీల్ చేశారు. అర్నాబ్ గోస్వామి కేసులో బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, ఆ కేసును ప్రస్తావించారు. దీంతో హైకోర్టు అల్లు అర్జున్‌కు నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ రూ.50వేల పూచికత్తు ఇవ్వాలని, రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయాలని ఆదేశించింది. తర్వాత అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌ను రెండు వారాలకు, బెయిల్ పిటిషన్‌ను జనవరి 21కి హైకోర్టు వాయిదా వేసింది. బెయిల్ పేపర్లను అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేశారు. అల్లు అర్జున్‌కు బెయిల్ రావడంతో అతడి అభిమానులు భారీ ఎత్తున చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకున్నారు.

పోలీసుల రాకతో….
ఢిల్లీ నుంచి తెల్లవారుజామునే అల్లు అర్జున్ కుటుంబంతో పాటు నగరానికి వచ్చాడు. ఢిల్లీ నుంచి వచ్చి సేదతీరుతున్న సమయంలో చిక్కడపల్లి పోలీసులు ఇంటికి రావడంతో అల్లు అర్జున్ కుటుంబం ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ముందుగా విచారణ కోసం రావాల్సిందిగా ఎసిపి ఎల్. రమేష్, ఇన్స్‌స్పెక్టర్ కోరడంతో డ్రస్ మార్చుకుని వస్తానని చెప్పారు. దీంతో ఎసిపి, ఇన్స్‌స్పెక్టర్‌ను అల్లు అర్జున్‌తో పాటు బెడ్‌రూంకు పంపించారు, పోలీసులు బెడ్‌రూంకు రావడంపై అల్లు అర్జున్, అతడి భార్య స్నేహా రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ డ్రస్ మార్చుకున్న తర్వాత కాఫీ తాగి భార్యకు హగ్ ఇచ్చి, ముద్దు పెట్టి ధైర్యంగా ఉండాలని, భయపడవద్దని సూచించారు. అర్జున్‌ను పోలీసులు వాహనంలో తీసుకుని వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అల్లు అరవింద్ తాను వస్తానని పోలీసుల వాహనంలో కూర్చున్నారు. అక్కడికి వచ్చిన అల్లు అర్జున్ తండ్రిని పోలీస్ వాహనం నుంచి దింపివేసి మంచైనా, చెడైనా తానే తేల్చుకుంటానని చెప్పి పోలీసుల వాహనం ఎకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

హైకోర్టులో క్వాష్ పిటిషన్…
ఓ వైపు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను హాజరుపర్చగా మరో వైపు ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరం కేసు విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరగా, అత్యవసర విషయం ఇందులో ఏముందని కోర్టు సాయంత్రం 4గంటలకు వాయిదా వేసింది. అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, సోమవారం విచారణ చేపట్టాలని పిపి కోరారు. తర్వాత వాదనలు ప్రారంభం కాగానే కేసును క్వాష్ చేయాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదించారు. క్వాష్ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం ఆధారంగా అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. సాయంత్రం 4గంటలకు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా అల్లు అర్జున్‌కు బెయిల్ ఇవ్వడంపై పిపి వ్యతిరేకించారు. ఇదే తీర్పు ఇప్పటికే అరెస్టు అయిన వారికి కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు జైలు నుంచి విడుదల కానున్నారు.

చంచల్‌గూడ జైలు వద్ద భద్రత
అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రిమాండ్ విషయం తెలుసుకున్న అతడి అభిమానులు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. దీనిని ముందుగానే ఊహించిన పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
పలువురి పరామర్శ…
చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేయడంతో చిరంజీవి, నాగబాబు, రానా తదితరులు అతడి ఇంటికి చేరుకున్నారు. సినీ నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో అక్కడికి వెళ్లారు. విశ్వంభర సినిమా షూటింగ్‌లో ఉన్న చిరంజీవి క్యాన్సిల్ చేసుకుని అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఆయనతో పాటు భార్య సురేఖ కూడా ఉన్నారు. కొద్దిసేపటికే నాగబాబు కూడా అక్కడికి చేరుకుని అల్లు అర్జున్ భార్యకు ధైర్యం చెప్పారు.

బందోబస్తు కోసం ఎవరూ కలవలేదుః డిసిపి
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ యాజమాన్యం చిక్కపడపల్లి పోలీసులకు లేఖ పంపించామని చెబుతున్నాదానిలో నిజంలేదని సెంట్రల్ జోన్ డిసిపి ఆకాంక్ష్ యాదవ్ తెలిపారు. థియేటర్ యాజమాన్యం కేవలం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రిసెప్షన్‌లో లెటర్ ఇచ్చి వెళ్లారని, అధికారులను కలవలేదని, హీరో అల్లు అర్జున్ వస్తున్నాడని, బందోబస్తు కల్పించాలని కోరలేదని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను అల్లు అర్జున్ కలవనివ్వలేదనే ప్రచారంలో వాస్తవంలేదని, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అతడే పోలీసుల వాహనంలోకి వచ్చి కూర్చున్నాడని తెలిపారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, మతపరమైన కార్యక్రమాలు మొదలైన వారి సందర్శనల కోసం బందోబస్తు కోసం తమకు అభ్యర్థనలు అందుతాయని తెలిపారు. కోరిన వారికి బందోబస్తు కల్పిస్తామని, ఈవెంట్‌కు బందోబస్తు కావాల్సిన వారు ఆర్గనైజర్ పోలీస్ స్టేషన్ లే దా ఎసిపి లేదా డిసిపిని వ్యక్తిగతంగా సంప్రదిస్తే బందోబస్తును కల్పిస్తామని తెలిపారు. థియేటర్ బ యట క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం బందోబస్త్ ఏర్పాటు చేశామని, పోలీసులకు అల్లు అర్జున్ వస్తున్నట్లు సమాచారం లేదని తెలిపారు. అదే సమయంలో అతడి ప్రైవేట్ సెక్యూరిటీ అభిమానులను నెట్టడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని తెలిపారు. అల్లు అర్జున్ రెండు గంటలకు పైగా థియేటర్‌లోనే ఉన్నాడని తెలిపారు. పోలీసు సిబ్బంది అల్లు అర్జున్ భార్య పట్ల దురుసుగా ప్రవర్తించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పోలీసులు తన నివాసానికి చేరుకోగా, దుస్తులు మార్చుకునేందుకు కొంత సమయం కావాలని కోరాడని తెలిపారు. పడక గదిలోకి వెళ్లి దస్తులు మార్చుకునే వరకు పోలీసు సి బ్బంది బయట వేచి ఉన్నారని తెలిపారు.

కేసు వాపస్ తీసుకుంటా
మృతురాలు రేవతి భర్త భాస్కర్
తొక్కిసలాటలో అల్లు అర్జున్ తప్పులేదని, కేసును వాపస్ తీసుకుంటానని తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి భర్త భాస్కర్ తెలిపారు. ఈ సంఘటనతో ఆయనకు సంబంధం లేదని పేర్కొన్నారు. తన కుమారుడు పుష్ప2 సినిమా చూస్తానంటే సంధ్య థియేటర్‌కు తీసుకుని వెళ్లానని తెలిపారు. కేసు విత్‌డ్రా చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, వెంటనే అల్లు అర్జున్‌ను విడుదల చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News