Thursday, December 19, 2024

ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు:అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ నంద్యాల ఎన్నికల ప్రచారంలో పాల్గ్గొన్న వ్యవహారంపై నటుడు అల్లు అర్జున్ స్పందించారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో జూబిలిహిల్స్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో సోమవారం అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై వివరణ ఇచ్చారు. నంద్యాలలో వైసీపీ నుంచి పోటీ చేసిన శిల్పా రవి పదిహేనేల్లుగా తనకు మిత్రుడని,

అతనికి గతంలో ఇచ్చిన మాట కోసమే మద్దత్తు ఇచ్చానని అన్నారు. మావయ్య పవన్ కళ్యాణ్‌కు తన మద్దత్తు ఎప్పుడూ ఉంటుందని అల్లు అర్జున్ తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక స్నేహితుడిగా మాత్రమే రవికి మద్దత్తు కోసం నంద్యాలకు వెల్లానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం అసలు లేదని అన్నారు. ఒక స్నేహితుడిగా సపోర్టు చేయమని రవి పలుమార్లు అడిగారని అల్లు అర్జున్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News