Friday, December 20, 2024

తెలుగు సినిమాకు కీర్తికి వన్నె తెచ్చిన నటుడు అల్లు అర్జున్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: తెలుగు సినిమా రంగం నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన తొలి కథానాయకుడు అల్లు అర్జున్‌కు మాజీ సీజేఐ ఎన్వీ రమణ అభినందనలు తెలిపారు. అత్యున్నత పురస్కారం ద్వారా తాత, తండ్రి, మామలతోపాటు, తెలుగు సినిమా కీర్తికి మరింత వన్నెతెచ్చారన్నారు. జాతీయస్థాయిలో తెలుగు సినిమా వైభవ పతాకాన్ని రెపరెపలాడించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు గర్వించేలా చేశారు.

ఇష్టంతో కష్టపడి గంగోత్రి నుంచి పుష్ప దాకా ఇంతింతై వటుడింతై అన్నట్లు మీరు ఎదిగిన క్రమం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. అల్లురామలింగయ్య వారసుడిగా వచ్చి తెలుగు సినీ పరిశ్రమను మీరు అల్లుకుపోయిన తీరు అబ్బురం. నాట్యం, నటనలో రాణించి ఆ అర్జునుడిలా సవ్యసాచి అని నిరూపించుకున్న ఈ అర్జున్ కి అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News