- Advertisement -
బెంగళూరు: కరోనాతో కన్నడ నటుడు శంకనాడ అరవింద్(70) కన్నుమూశారు. వారం రోజుల క్రితం కరోనా సోకడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్నాళ్ల కిత్రం తల్లి చనిపోగా, ఇప్పుడు తండ్రిని కూడా దేవుడు దూరం చేశాడని ఆయన కూతురు సోషల్ మీడియాలో తెలిపింది. జ్ఞానగంగే, శంకనాడ, అగుంటక, బెట్టాడ హూవు, అనుభ వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పటి వరకు 250 సినిమాల్లో నటించారు.
- Advertisement -