- Advertisement -
కోలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కూతురు, నటి ఐశ్వర్య.. నటుడు ఉమాపతి రామయ్యను వివాహం చేసుకోబోతున్నారు. దీంతో చెన్నైలోని అర్జున్ నివాసంలో పెళ్లి వేడకలు ప్రారంభమయ్యాయి. హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ఉమాపతి రామయ్య.. కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడే. ఉమాపతి, ఐశ్వర్య గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరుకుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.
- Advertisement -