- Advertisement -
ప్రముఖ నటుడు అర్జున్ సర్జా కూతురు తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతోంది. అర్జున్ చిన్న కూతురు అయిన అంజన త్వరలోనే ఇటలి ప్రేమికుడితో ఏడడుగులు వేయనుంది. తాజాగా అతనితో అంజన నిశ్చితార్థం జరిగింది. ఇటలీలో ఇరు కుటుంబాల సభ్యుల మధ్య వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ విషయాన్ని అంజన సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. 13 ఏళ్ల తర్వాత కల నెరవేరింది అంటూ ఫోటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య గతేడాది నటుడు ఉమాపతి రామయ్యను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఐశ్వర్య పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.
- Advertisement -