Monday, January 20, 2025

ప్రముఖ నటుడు అర్జున్ కు మాతృ వియోగం!

- Advertisement -
- Advertisement -

Arjun's mother

బెంగళూరు: ప్రముఖ నటుడు అర్జున్‌ సార్జాకు మాతృ వియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ (85) శనివారం ఉదయం కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమె బెంగుళూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మైసూర్‌లో స్కూల్‌ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పస్తుతం ఆ లక్ష్మీ దేవమ్మ పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్‌లో ఉంది.  ఇటీవల అర్జున్‌ దర్శకత్వంలో విశ్వక్సేన్‌ హీరోగా ఓ చిత్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ చిత్రంతో ఆయన కూతురు ఐశ్వర్యా అర్జున్‌… తెలుగు పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News