Saturday, December 21, 2024

దిల్ రాజు ఇంట మోగనున్న పెళ్లి బాజాలు.. ఘనంగా హీరో ఆశీష్ నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట నిశ్చితార్థం వేడుక జరిగింది. దిల్ రాజు సోదరుడు, ప్రడ్యూసర్ శరీష్ తనయుడు, హీరో ఆశిష్ రెడ్డి నిశ్చితార్థం గురువారం హైదరాబాద్ లోని వారి నివాసంలో ఘనంగా జరిగింది. ఏపికి చెందిన అద్విత రెడ్డి అనే అమ్మాయిని ఆశీష్ రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇరు కుటుంబాలు, దగ్గరి బంధువుల మధ్య వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

అశీష్ రెడ్డి సినిమాల విషయానికి వస్తే.. యూత్ ఫుల్ మూవీ ‘రౌడీబాయ్స్’తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అశీష్ రెండో సినిమా ‘సెల్ఫిష్’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలై ఈ మూవీలోని సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News